Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికలో పద్మశాలీలంతా టీఆర్ఎస్కు అండగా ఉంటారని, ప్రజా సంక్షేమం కోసం పరితపించే టీఆర్ఎస్కే ఓటు వేస్తామని పద్మశాలి అఖిలభారత సంఘం నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు పద్మశాలీలు ఏకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మ్యాడం బాబురావు, ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, సునీల్, కర్నాటి శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు గుండేటి సతీశ్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన పద్మశాలి కుల బంధువులకు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.