మెదక్ : బీఆర్ఎస్ పార్టీ(BRS )కార్యకర్తలకు(Activists) అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(Padmadevender Reddy) అన్నారు. మండల కేంద్రమైన చిన్న శంకరంపేటకు చెందిన డప్పు నరసింహులు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతుడికి పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన రూ.2,00,000 ఇన్సూరెన్స్ చెక్కును( Insurance check) మృతుడి భార్య శోభకు శుక్రవారం వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరసింహులు మృతి చెందడం బాధాకరమని, చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు కొండత భరోసా నిస్తుందని పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్త చనిపోతే రెండు లక్షల రూపాయల బీమా అందిస్తున్న ఏకైక పార్టీ దేశంలో బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట ఆర్ మండల పార్టీ అధ్యక్షులు రాజు, శంకరంపేట్ పట్టణ పార్టీ అధ్యక్షులు హేమ. చంద్రం, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ యాదగిరి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మణ్,దయానంద్ యాదవ్ నాయకులు కుమార్ గౌడ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ ప్రభాకర్, స్వామి,శ్రీనివాస్ నరేష్ వెంకటేశం లక్ష్మణ్, చిలక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.