Huzurabad | హుజూరాబాద్ : ‘నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నాను. నాకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉంది. నన్ను బీజేపీ వాళ్లు ఎలా అడ్డకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? కేవలం ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్‌తోనే ఇలా ప్రవర్తిస్తున్నారు. బీజేపీ నేతలకు ప్రజలు కచ్చితంగా ఓటుతో బుద్ధి చెబుతారు’ అని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన పలు పోలింగ్ బూతులను సందర్శిస్తుంటే పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లు బీజేపీ నేతలు చిత్రీకరించారని మండిపడ్డారు కౌశిక్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను టీఆర్ఎస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నా. నాకు రాజ్యాంగం ప్రకారం 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. నా వెనుక టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ లేరు. అయినా బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు? కేవలం ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్‌తోనే బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు’ అని మండిపడ్డారు.