హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో తమ విద్యార్థులు విజయ దుందుభి మోగించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు. 720/720 మార్కులతో ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో సామ్ శ్రేయాస్ జోసెఫ్, కే సందీప్చౌదరి, షాహ్, పీ ఆదిత్యకుమార్, శశాంక్శర్మ, ఈషా కొఠారి, ప్రాచిత, దర్శ్ పగ్దార్ (ఎనిమిది మంది) ఫస్ట్ ర్యాంకులు సాధించినట్టు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
715 మార్కులు సాధించినవారిలో13 మంది, 710 మార్కులు మార్కులు సాధించిన వారిలో 20 మంది నారాయణ విద్యార్థులు ఉన్నారని వివరించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర బృందాలకు డైరెక్టర్ సింధూర నారాయణ అభినందలు తెలిపారు.