హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం గల ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం ద్వారానే జీతాలు చెల్లించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేరుగా ప్రభుత్వం, కార్పొరేషన్ ద్వారా వేతనాలను అందించాలని ప్రకటనలో కోరింది.
జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రతి నెలా 5లోపు వేతనాలు అందించాలని, హెల్త్‌కార్డులు మంజూరుచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెలవులను 30కి పెంచాలని కోరారు.