Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎం ఫార్మసీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసీ (పీసీఐ) (ఆల్ స్పెషలైజేషన్స్) రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, రెండు, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి తలకాయ లేని ముఖ్యమంత్రి.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao | నడిరోడ్డుపై కుటుంబ సర్వే దరఖాస్తులు.. హరీశ్‌రావు ఫైర్