Harish Rao | రేవంత్ రెడ్డి తలకాయ లేని ముఖ్యమంత్రి.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao | హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | ఖమ్మం : హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం.. అబద్దాలు చెప్పడం ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
గ్యారెంటీలు అమలు చేయనందుకు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బందు పెట్టి రైతులకు రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రూ. 15000 రైతుబంధు ఇస్తామని చెప్పి ఉన్న రూ. 10000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం. ప్రతిపక్షాల గొంతు నొక్కడం వంటివి చేస్తున్నాడు. ఇగురం లేనోడు వ్యవసాయం చేస్తే వడ్లు వాగులో గడ్డి గాళ్ళలో కొట్టుకుపోయింది అంట. ఈ రేవంత్ రెడ్డి పాలన ఇట్లనే ఉన్నది. అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు విమర్శించారు.
అదానీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒక మాట గల్లీ కాంగ్రెస్ ఒక్క మాట. రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. అదానీ నుండి రూ. 100 కోట్ల చెక్కు తీసుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో రాహుల్ గాంధీ చెప్పాలి. అంతర్గత ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు అదానీ అనేవాడు తెలంగాణకు రాగలిగాడా? ఒక రూపాయి అయినా తెలంగాణలో పెట్టుబడి పెట్టగలిగాడా? అవినీతి ఆరోపణలతో అమెరికాలో అదానీని అరెస్టు చేయాలని చూస్తున్నారు. అలాంటి అదానీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుంది రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటున్న రైతులు : హరీశ్‌రావు
KTR | అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి.. రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ డిమాండ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

