Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. బ్యాక్లాగ్ అభ్యర్థులకు ఇది చివరి అవకాశమని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
Jagithyala | గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పై దాడి.. భయాందోళనలకు గురైన విద్యార్థినులు
Tim Southee | న్యూజిలాండ్ స్టార్ పేసర్ వీడ్కోలు.. సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్