హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా దవాఖానను నిర్మిస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. దవాఖాన భవన నిర్మాణాలపై బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 26.30 ఎకరాలు, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 వేల పడకల సామర్థ్యంతో ప్రజలకు దవాఖానను అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియాలో 22 డిపార్ట్మెంట్లు ఉండగా.. అదనంగా మరో 8 విభాగాలను కొత్త ఉస్మానియాలో ప్రారంభిస్తామని తెలిపారు.