సంగారెడ్డి: సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరు (Kolluru) వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. అక్కడితో ఆగకుండా ఓఆర్ఆర్ పక్కన చెట్లకు నీళ్లుపోస్తున్న కార్మికులను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్రేన్‌సహాయంతో లారీని అక్కడిన ఉంచి తొలగించారు. మృతులను బాబు రాథోడ్, కమలీబాయ్, బసవప్ప రాథోడ్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.