హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ట్యూషన్ సహా ఇతర ఫీజులు చెల్లించకలేదన్న సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి హెచ్చరించింది. ఇలాంటి కాలేజీలను బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ రాష్ట్రంలోని అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. ఈ ఆదేశాల మేరకు వర్సిటీలు తమ పరిధిలోని కాలేజీలకు లేఖలు పంపాలని పేర్కొన్నారు.