హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్ కుమార్ పాప బర్త్‌డే వేడుకలు విషాదంగా ముగిశాయి. బర్త్ డే వేడుకలను గోవాలో ఘనంగా నిర్వహించుకుని.. హైదరాబాద్‌కు వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు బుగ్గిపాలైంది. ఈ ప్రమాదంలో 8 మంది సజీవదహనం అయ్యారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జీవన్(4), దీక్షిత్ (9), రవళి(30), సరళాదేవి(32), అర్జున్(37), శివకుమార్(35), అనితరాజు(40)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఒక కుటుంబంలో 11 మంది, మరో కుటుంబంలో 21 మంది వెళ్లారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు క్లీనర్లు ఉన్నారు.
అయితే ఉదయం 6:30 గంటల సమయంలో బీదర్ – శ్రీరంగపట్నం హైవేపై కమలాపుర సమీపంలో అర్జున్ కుమార్ కుటుంబం ప్రయాణిస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డీజిల్ ట్యాంక్‌ను టెంపో వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మంటలు ఎగిసిపడి క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటలు చెలరేగే సరికి బస్సులో ఉన్న కొందరు అప్రమత్తమై కిటికీలను పగులగొట్టి కిందకు దూకారు. తమ కండ్ల ముందే బస్సులో ఉన్న వారు సజీవదహనం కావడంతో మిగతా వారు బోరున విలపించారు. ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 8 మంది సజీవదహనం అయ్యారు. pic.twitter.com/qeZYdmT4ec
— Namasthe Telangana (@ntdailyonline) June 3, 2022