NEET UG | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక మార్పులు చే సింది. ముఖ్యంగా ఐచ్ఛిక ప్రశ్నలను తొలిగించింది. ఇక నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయాన్ని 180 నిమిషాలకు కుదించింది. కొవిడ్ నేపథ్యంలో 2020లో 20 చాయిస్ ప్రశ్నలివ్వగా, పరీక్షా సమయాన్ని 200 నిమిషాలకు ఎన్టీఏ పెంచింది. కొవిడ్‌కు పూర్వమున్న పరీక్షావిధానాన్ని ఈ ఏడాది నుంచి పునరుద్ధరించింది. ఇక నీట్-యూజీ పరీక్షను మే 4న ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నది. నీట్-యూజీ రిజిస్ట్రేషన్‌కు అపార్ ఐడీ తప్పనిసరికాదని ఎన్టీఏ ప్రకటించింది.
మార్పులివే..