సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 19:07:18

పాలమూరులో ప్రతిపక్షాలకు స్థానం లేదు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

పాలమూరులో ప్రతిపక్షాలకు స్థానం లేదు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ  మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని హన్వాడ మండలం టంకర సర్పంచ్ మెండె అచ్చన్న, ఉపసర్పంచ్ తిరుపతమ్మ, మెండే రాజుతో పాటు దాదాపు రెండు వందల మంది సభ్యులు మంత్రి సమక్షంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరులో ప్రతిపక్షాలకు స్థానమే లేకుండా పోతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్ రాజ్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo