Congress-BJP | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమ స్తే తెలంగాణ): ‘ప్రజల్లోకి వెళ్లండి. ప్రచారం చేయండి. అని చెప్తున్నారు. కానీ, అభ్యర్థి ఎవరో చెప్పరు. ఎవరి కోసం ప్రచారం చేయాలి?’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇదే. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాల ఫలితాలను చూసి తమ కు ఓటేయాలని ప్రజలను కోరుతున్నా రు. ఇంతకుమించిన అభివృద్ధి, సంక్షే మ పథకాలను సీఎం కేసీఆర్ ఆదివా రం ప్రకటించనున్న మ్యానిఫెస్టోలో వె ల్లడిస్తారని చెప్తున్నారు. కేసీఆర్కు హ్యా ట్రిక్ విజయం కట్టబెట్టాలని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. తమ నియోకవర్గం టికెట్ ఎవరికి వస్తుందో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఆ పార్టీకి అనేకచోట్ల గట్టి అభ్యర్థులు లేరు. అయినా ఉన్న నేతలే టికెట్ కోసం కొట్లాడుకుంటున్నారు.
బీజేపీ పరిస్థితి మరీ దయనీయం గా ఉన్నది. పోటీకి అభ్యర్థులే లేని పరిస్థితి. ఎవరి ముఖం చూపించి ఓట్లు అ డగాలో అర్థం కావడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. మోదీ పేరు చె ప్పి ఓటేయాలని అడగాలంటే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజి ల్, గ్యాస్ ధరలు వెక్కిరిస్తున్నాయి. మోదీని ప్రధానిగా ఉంటారా? తెలంగాణకు వస్తారా? అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నా రు. ఎన్నికలకు 45 రోజులు మాత్రమే ఉన్నాయని, ఇంత తక్కువ టైంలో అభ్యర్థులు, మ్యానిఫెస్టోను ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడు ప్రచారం మొదలు పెట్టాలో! తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.