హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 6న విడుదల కానున్నది. ఈ క్రమంలో బుధవారం మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు.
ఫిబ్రవరి 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 16వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.