హైదరాబాద్: రాష్ట్రంలో మునెప్పుడూ లేనివిధంగా భారీగా ఉల్లి దిగుమతి (Onion Imports) అయ్యింది. ఉల్లిగడ్డ పంట దిగుబడి సీజన్ అయిన ఏప్రిల్, మే నెలల్లో పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి కావడం సహజమే. అయితే ఈసారి జూన్ నెలలో కూడా భారీగా ఉల్లి దిగుమతులు జరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో ప్రధాన మార్కెట్ అయిన మలక్‌పేట గంజ్‌కు 141 లారీల ఉల్లిగడ్డ దిగుమతి జరిగినట్టు అధికారులు తెలిపారు.
అయితే అందులో 105 లారీల ఉల్లి ఒక్క మహారాష్ట్ర నుంచి దిగుమతి కావడం గమనార్హం. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 43 వేల ఉల్లి బస్తాలు నగరానికి చేరాయి. కాగా ఈ దిగుమతి అయిన ఉల్లి క్వింటాలుకు రూ.1500 నుంచి రూ .1800గా పలుకుతోంది. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం అంతకురెట్టింపు ధరకు కొనుగోలు చేయవలసి వస్తున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.