సంగారెడ్డి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఇన్ ఫ్లో 6048 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా,
ప్రస్తుత నీటి నిల్వ 21.078 టీఎంసీలుగా ఉంది. పెరుగుతున్న వరద దృష్ట్యా ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.