ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి- పస్రా మధ్య శుక్రవారం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో పస్రాకు చెందిన గగ్గోజు రామాచారి మృతి చెందగా..సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.