హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో మహాధర్నా సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సూటిగా ఉన్న ప్రసంగం ఆలోచింపచేసేలా ఉన్నదని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వార్తాపత్రిక ట్రిబ్యూన్ చీఫ్ ఆఫ్ బ్యూరో నవీన్ ఎస్ గార్వెల్ సీఎం కేసీఆర్ ప్రసంగంలో లాజిక్ ఆకట్టుకున్నదని ట్వీట్ చేశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేసిన సంక్షిప్త, పదునైన ప్రసంగంలో లాజిక్ ఆకర్షిస్తున్నది. దేశంలోని రైతులతో ఎవరూ రాజకీయాలు చేయలేరు. ఏప్రిల్ 12న ధాన్యం కొనుగోలుపై తెలంగాణ క్యాబినెట్ తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నది’ అని ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేసిన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ‘వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్.. జై తెలంగాణ’ అంటూ మరో ట్వీట్ చేశారు.