హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం (Batasingaram) వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. వారిద్దరిని సికింద్రాబాద్కు చెందిన దంపతులు గిరిజకుమారి, హరినారాయణగా గుర్తించారు. కాగా, హరినారాయణ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.