శంషాబాద్ రూరల్, ఆగస్టు 11: షూలో దాచి తీసుకొస్తున్న రూ.కోటి విలువైన బంగారాన్ని ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే-528 నంబర్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్లో దిగగానే వారు తనిఖీ చేశారు. బూట్లు, ఇతర సామాన్లు ఉన్న బ్యాగును అధికారులు స్కాన్ చేయగా దానిలో కిలోన్నర బంగారం బయటపడింది. బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పసుపు రంగు పెద్ద మెటల్ బార్లను ఎడమకాలి షూలో దాచి తెచ్చినట్టు వారు గుర్తించారు. అతని నుంచి 1390.850 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన బంగారం విలువ 1.6 కోట్ల వరకు ఉంటుందని, నిందితుడిపై కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.