జగిత్యాల : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం రెండో రోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో బీఆర్ఎస్(BRS), మహిళా సంఘాలు. జాగృతి(Jagruthi) శ్రేణులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహిళలకు సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ నినాదాలు చేశారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని బట్టపల్లిలో , నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో, ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ చౌరస్తా వద్ద బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు(BRS leaders) మాట్లాడుతూ ఉద్యమ కుటుంబంలో జన్మించి మహిళ చైతన్యం కోసం అహర్నిశలు పాటుపడుతున్న బీఆర్ఎస్ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పై బండి సంజయ్ వ్యాఖ్యలు యావత్ మహిళా సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. మరోసారి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Distibomma