హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగంగా సాగుతున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాలతో పాటు గిరిజనాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.
ఆదివాసీల అభ్యున్నతికి కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, గిరిపుత్రులకు ఇటీవలే అటవీ భూయాజమాన్య హక్కు పత్రాలను అందించామని తెలిపారు. ఆదివాసీ గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు