హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ పనులను సోమవారం ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ పరిశీలించారు. వసంత్‌విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కార్యాలయ పనులు తుది దశకు చేరుకున్నాయని నిర్మాణసంస్థ ప్రతినిధులు వివరించారు.
ఈ నెల 4న బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం కోసం సీఎం కేసీఆర్ మంగళవారమే ఢిల్లీ వెళ్లే అవకాశమున్నది.