Oscar winner | ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు 28న అభినందన సభ
Oscar winner | ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు ఈనెల 28న రవీంద్రభారతిలో అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
హైదరాబాద్ : ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ (Oscar winner Chandra Bose) కు ఈనెల 28న రవీంద్రభారతిలో అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ( Chairman Juluru Gauri Shankar) ,తెలిపారు. తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ‘ నాటు నాటు ’ పాటతో సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగాణ సమాజం గర్వించతగిందని పేర్కొన్నారు.
సాహిత్య అకాడమీ కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షతన చంద్రబోస్ అభినందన సభ సన్నాహక సమావేశాన్ని(Preparatory Meeting)బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారి తెలుగు గీతానికి ఆస్కార్ అవార్డు(Oscar Award) రావడం ఆనందించాల్సిన విషయమన్నారు. తెలుగు ప్రజలందరూ సంబరపడటానికి కారకుడైన చంద్రబోస్ కు, ఆ పాటకు సంగీతం, నృత్యం, దర్శకత్వం వహించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శి కె ఆనందచారి, తెలంగాణ సాహితీ సహకార దర్శి ఎన్కె సలీమా, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్, కాళోజి అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

