హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1 పోస్టుల భర్తీకోసం ఆన్లైన్ విధానంలో కాకుండా.. ‘ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్’ విధానంలో ప్రాథమిక పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించనున్నట్టు బుధవారం టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. జూన్ 9న ప్రాథమిక పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 563పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు.