ముథోల్, అక్టోబర్ 19 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పెద్ద కొడుకుకంటే ఎక్కువ. సొంతగా పుట్టినోళ్లే ఈ కాలంలో పట్టించుకుంటలేరు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్తో సంతోషంగా బతుకుతున్నా. నాకు ఎవరు చెప్పే అవసరం లేదు. కారు గుర్తుకే ఓటేస్తా’ అని నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు సాంగి ఎల్లవ్వ ఘంటాపథంగా చెప్తున్నది.
గురువారం ఇంటింటి ప్రచారంలో భాగంగా తమ ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ ముథోల్ మండల అధ్యక్షుడు అప్రోజ్ఖాన్, పార్టీ కార్యకర్తలు, సర్పంచ్ ఎదుట ఆమె చెబుతూ సంబురపడింది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ‘కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని, మళ్లోపారి పింఛన్ పెంచుతామనడంతో సంతోషం కలిగింది. మేం కేసీఆర్ సార్తోనే ఉంటాం. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటాం. ఎవరు చెప్పినా వారి మాటలు నేను వినను. సారే మాకు కావాలి’ అని సాంగి ఎల్లవ్వ స్పష్టం చేసింది.