హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో విద్యుత్తు చార్జీల టారిఫ్ ఖరారు ప్రకటనను విద్యుత్తు నియంత్రణ మండలి వాయిదావేసింది. ఏప్రిల్ వరకు పాత టారిఫే కొనసాగుతున్నది.
2025-26 వార్షికాదాయ ఆవశ్యకత (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలపై విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఇటీవలే బహిరంగ విచారణ జరిపింది. విద్యుత్తు సంస్థలు చార్జీలు పెంచబోమంటూ ఈఆర్సీ ముందు వాదనలు వినిపించాయి.