హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నేటి తరానికి కొప్పుల ఈశ్వర్ జీ వితం ఆదర్శమని, ఆయన నిరంతరం తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటుపడిన గొ ప్ప వ్యక్తి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కొనియాడారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన రాజకీయ జీవితంపై రచయిత నూతి మల్లన్న రాసిన ‘ఒక ప్రస్థానం’ పుస్తకాన్ని ఆదివారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. 2001నుంచి కొప్పుల ఈశ్వర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఈశ్వర్‌తో నాకు 24 ఏండ్ల అనుబంధం ఉన్నది. ఈ పుస్తకం చదివితే వారిలో ఉన్న ఇంకో కో ణం కనపడింది. ఈశ్వర్లో మేము ఎప్పు డూ కోపం, అసహనం చూడలేదు. చాలా కూల్‌గా, ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు.
ఈ పుస్తకం చదివిన తరువాత ఆయనలో గొప్ప పోరాటయోధుడు కనిపించారు. ఈయనేనా అప్పట్లో కార్మికుల కోసం జావీదులు, జాఫర్‌ల మీద పోరాటం చేసింది అని అనిపించింది. మేమంతా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేశాం. కానీ, కార్మికోద్యమం, విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమం వంటి మూడు ఉద్యమాల్లో పనిచేసిన ఘనత కొప్పుల ఈశ్వర్ది. ఈ మూడు ఉద్యమాల్లోనూ జైలుకి వెళ్లిన వ్యక్తి ఆయన..కూలి పని నుంచి క్యాబినెట్ మంత్రి వరకు ఈశ్వర్ ప్రస్థానాన్ని అద్భుతంగా వివరించిన పుస్తక రచయిత మల్లన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈశ్వర్ సతీమణి స్నేహలతగానే తనకు తెలుసునని, కానీ ఈ పుస్తకం ద్వారా ఆమె అసలు పేరు కోకిల అని తెలిసిందని చెప్పారు. ఆమె వల్లనే ఈశ్వర్ జీవితం మారిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నా కూడా నవరాత్రుల్లో దేవీ దీక్ష తీసుకునేంత భక్తి ఈశ్వర్లో ఉన్నదని వివరించారు. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ నాయకత్వంలో వరుసగా ఆరుసార్లు ఓటమి ఎరుగని నాయకుడిగా అద్భుత విజయాలు సాధించారని గుర్తచేశారు.
‘మాది అన్నదమ్ముల అనుబంధం. ప్రజల కోసం పట్టుబట్టి వెంటపడి పని చేయించుకునేవారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహా న్ని కేసీఆర్ నాయకత్వంలో కొప్పుల ఈశ్వర్ ప్రతిష్ఠించారు. ఈతరం నాయకులు ఆయన నుంచి ఈ గుణాన్ని నేర్చుకోవాలి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అనంతరం కొప్పుల ఈశ్వర్‌తో గతంలో పనిచేసి అమరులైనవారి కుటుంబసభ్యులను హరీశ్‌రావు సన్మానించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంది శ్రీనివాస్ పు స్తక సమీక్ష చేయగా, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ ఉప ముఖ్యమంత్రి మ హమూద్ అలీ, మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, యూపీఎస్సీ మాజీ సభ్యుడు కేఎస్ చలం, అంబేద్కర్ ఓపెన్ యూ నివర్సీటీ వీసీ ఘంటా చక్రపాణి, హైకోర్టు మా జీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రామ సత్యనారాయణ, ఈశ్వర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
30 కేసులున్నా నాతో నడిచింది
నేను చూసిన సింగరేణిని నేటి తరానికి అందించే ప్రయత్నమే ఈ పుస్తకం. నాడు విప్లవ పార్టీలో పనిచేసిన సందర్భంలో నాపై 30 కేసులు ఉన్నాయని తెలిసి కూడా నా తోడుగా, నా భార్యగా స్నేహలత నడిచింది. 17 మంది బొగ్గు బావుల్లో జలసమాధి అయినప్పుడు కేసీఆర్ స్పందించి వారి కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం అందేలాచేశారు. నా రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ నాకొక గొప్ప అవకాశం కల్పించారు. దాన్ని నిలబెట్టుకున్నాను. సింగరేణి కార్మిక సంఘం (సికాస) నిర్మాణం, గోదావరిఖని విషయాలెన్నో ఈ పుస్తకంలో దాగి ఉన్నాయి
-కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
విప్లవభావాల కలయికనే బీఆర్ఎస్
మహనీయుడు అంబేద్కర్, విప్లవభావాలు కలిగిన జార్జిరెడ్డి లాంటి వారి ఆశయాల కోసం పనిచేసిన వాళ్లం. విప్లవభావాలు కలిగిన వారమంతా స్వరాష్ట్ర సాధనలో ముందునిలిచాం. ఆ సిద్ధాంతం మీద ప్రేమతోనే ప్రజలకు సేవలందిస్తున్నం. ఈశ్వర్ తన జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని ఇందులో ప్రతిబింబించారు. -సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రితెలంగాణ పరిస్థితులను తెలుపుతున్నది కొప్పుల ఈశ్వర్ తన ప్రస్థానంలో తెలంగాణ పరిస్థితులను ప్రతిబింబించారు. సామాజిక, విప్లవ పరిస్థితులను ఇందులో ప్రస్తావించడం బాగున్నది. ఉద్యమ సహచరుడు, ఇద్దరం కలిసి ప్రజాసేవలో ఉన్నవాళ్లమే. -జీ జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి
ఎర్రజెండా బాటలోనే..
కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం ప్రారంభమైంది ఎర్రజెండాతోనే. కార్మికుడి నుంచి క్యాబినెట్ మంత్రి వరకు ఎదిగారు. అంచలంచలుగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఈశ్వర్‌లోని లక్షణం.
-చాడ వెంకటరెడ్డి, సీపీఐ నేత