కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ సర్కారు హయాంలో తెచ్చిన ధరణి పోర్టల్ దశాబ్దాల భూసమస్యలకు దారిచూపింది. దీనిని అభాసుపాలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా కష్టపడుతున్నది. భూ సమస్యల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తిరస్కరిస్తూ, రైతులపై ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులను తిరస్కరించగా, అందరికీ ఒకే రకమైన కారణాలు చూపటం గమనార్హం. ఉదాహరణకు.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన రైతు గుమ్మడి అంజయ్య.. మిస్సింగ్ సర్వే నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ అర్జీని గ్రామపంచాయతీ బోర్డుపై అతికించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. గడువులోగా ఎటువంటి అభ్యంతరాలు రాలేదని అధికారులు తెలిపారు. కానీ, భూమిని సాదాబైనామా ద్వారా వేరే వ్యక్తులకు అమ్మారని, మోఖాపై వేరేవాళ్లు ఉన్నారన్న కారణాలను చూపుతూ అప్లికేషన్‌ను తిరస్కరించారు. నిజంగానే సాదాబైనామాపై విక్రయి ంచినా, లేదా మోకాపై వేరేవాళ్లు ఉన్నా పంచాయతీపై నోటీసు బోర్డులో అతికించినప్పుడే అభ్యంతరం చెప్పేవారు కదా? అన్న ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఇదే ఫా ర్మాట్లో వేల దరఖాస్తులను తిరస్కరించారు.
ధరణి పోర్టల్‌లోని 35 మాడ్యూళ్ల కింద రైతులు తమ రెవెన్యూ భూసమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటారు. ఉదాహరణకు.. టీఎం-33 మా డ్యూల్ కింద మ్యుటేషన్, సక్సేషన్ వంటి సమస్యల పరిష్కారం కోసం మీసేవకు వెళ్లి ఆన్లైన్లో నిర్ధారిత చార్జీలు చెల్లించి అర్జీ పెట్టుకుంటారు. ఆన్లైన్ అయిన తర్వాత రైతు దరఖాస్తు చేసుకున్న కాగితాలతోపాటు తన దగ్గర ఉన్న భూమి ఆధారాలను ఎమ్మార్వో ఆఫీసు లో అందజేస్తారు. వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలి. వివిధ మాడ్యూళ్ల కింద టెక్నికల్ సమస్యల పరిష్కారానికి, పెండింగ్‌లో ఉన్న నాలా పరిష్కా రం కోసం, మాడిఫికేషన్ రిక్వెస్ట్‌కు సంబంధిం చి మిస్సింగ్ సర్వే నంబర్లు పట్టాదారు పేరు మార్పులు చేర్పులు, విస్తీర్ణంలో తేడాల వాటి సవరణ, ఖాతా మెర్జింగ్, నిషేధిత జాబితా నుంచి తొలగింపు, డూప్లికేట్ పట్టాదారు పాసుపుస్తకాలు.. ఇలా విభిన్న రెవెన్యూ సమస్యల కోసం భూయజమానులు మీసేవ కేంద్రాల్లో ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకుంటారు. ఉదాహరణకు.. మ్యుటేషన్ ఆఫ్ ల్యాండ్‌కు ఒక్కో ఎకరానికి రూ.2,500, పట్టాదారు పా సుపుస్తకం, టైటిల్ డీడ్‌కు రూ.300 చెల్లించా లి. ల్యాండ్ కన్వర్షన్‌కు బేసిక్ వ్యాల్యూలో 3 శాతం చెల్లింపులు చేయాలి. ఇలా ఒక్కోదానికి ఒక్కో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి రిజెక్ట్ చేస్తే తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకోవటమే కాదు.. మళ్లీ నిర్ధారించిన ఫీజులు చెల్లించాలి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అనర్హత ఉంటేనే కారణం చెప్తూ దరఖాస్తును తిరస్కరించాలి. కానీ, కాంగ్రెస్ స ర్కారు హయాంలో ఇవేవీ లేకుండా విచ్చలవిడిగా దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. జూలై 5 నుంచి 10 మధ్యే భారీగా దరఖాస్తులను తిరస్కరించినట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను అభాసుపాలుచేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నది. బడ్జెట్ సమావేశాల్లో సమాధానం చెప్పాల్సి వస్తుందని భావించి, జూలై మొదటి వారంలో దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి పెట్టింది. జూలై 10లోగా ఆన్లైన్లో ఉన్న దరఖాస్తులకు ఏదో ఒక పరిష్కారం చూపాలని పైనుంచి ఒత్తిడి పెరిగింది. ఆమేరకు కలెక్టర్లు సిబ్బందిపై ఒత్తిడి చేయటంతో.. తహసీల్ కార్యాలయం లో ఉన్న సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించే సామర్థ్యం లేక పైఅధికారులకు అన్నీ క్లియర్ చేశామని చెప్పుకోవడానికి తిరస్కరణ ప్రక్రియ చేపట్టి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తున్నది. దీనివల్ల ఫీజులుగా చెల్లించిన రూ.కోట్లను రైతులు నష్టపోయారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు (జూలై 25న) ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, చేసిన ప్రకటనలకు.. ఇదే అంశంపై ఆగస్టు 2న జరిగిన చర్చలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నది. బడ్జెట్ ప్రవేశ ప్రసంగం సందర్భంగా భట్టి.. ‘ధరణి అమలు వల్ల వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించాం. ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెడింగ్‌లో ఉన్న దరఖాస్తుల ను పరిశీలించి, పరిష్కరించడానికి మార్చి 1 నుంచి 16 వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. 2024 మార్చి ఒకటి నాటికి 2,26,740 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండ గా, కొత్తగా 1,22,774 దరఖాస్తులు వచ్చా యి. మొత్తం 3,49,514 దరఖాస్తుల్లో మార్చి ఒకటి నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి 1,79,143 దరఖాస్తులను పరిష్కరించింది’ అని చెప్పారు. ఆగస్టు 2న శాసనసభలో చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘మేం అధికారంలోకి వచ్చేనాటికి ధరణిలో 2.45 లక్షల దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నా యి. వాటిలో 1.19 లక్షలను క్లియర్ చేశాం. మళ్లీ లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వాటి ని మూడు వారాల్లోగా పరిష్కరిస్తాం’ అని వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏ మిటంటే.. మార్చి ఒకటి నాటికి 2,26,740 దరఖాస్తులు వచ్చాయని భట్టి చెప్తే, పొంగులేటి మాత్రం అధికారంలోకి వచ్చే నాటికే 2.45 లక్షల దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నాయ న్నారు. దరఖాస్తులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని చూపి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే పొంగులేటి తప్పులు చె ప్పారన్న విమర్శలు అప్పుడే వచ్చా యి. 1.79 లక్షల దరఖాస్తులను కాంగ్రెస్ ప్ర భుత్వం పరిష్కరించినట్టు బడ్జెట్ ప్రసంగంలో భట్టి చెప్పగా.. 1.19 లక్షల దరఖాస్తులను క్లి యర్ చేసినట్టు పొంగులేటి చెప్పటం గమనార్హం.
ధరణి పోర్టల్ రాక ముందు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగేది. గంటల పాటు పడిగాపులు పడాల్సి వచ్చేది.స్లాట్ బుకింగ్‌ను అమల్లోకి తేవటం వల్ల సమయానికి వెళ్లి గంటలోపు రిజిస్ట్రేషన్ ముగించుకొని వెళ్తున్నారు.
కోనరావుపేటలో మా తల్లి చందనగిరి రామలక్ష్మి, తండ్రి రామస్వామి పేరు మీద 0.07 గుంటల భూమి ఉన్నది. ఆమె మరణించగా మా అన్నదమ్ములమంతా కలిసి విరాసత్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. ఆ భూమికి పాస్‌బుక్, పాత పహాణీలను జతచేసి ఎమ్మార్వో ఆఫీసులో అందజేశాం. కానీ అధికారులు వాటిని పరిశీలించకుండా ఆన్లైన్లో భర్త పేరు తప్పుగా ఉందని రిజెక్ట్ చేశారు. ఆరు నెలలుగా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతు న్నా.. రెండు సార్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా రెండు సార్లు రిజెక్ట్ చేశారు. దీంతో డబ్బులు నష్టపోవడంతోపాటు భూమి ఆన్లైన్ కాకపోవటంతో అన్ని విధాలుగా నష్టపోతున్నాం. అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు.