వనదేవతల సన్నిధిలో అపచారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క అధికారులతో కలిసి తల్లుల సన్నిధితో పాటు నిర్మాణ పనులను పరిశీలించారు.
- చెప్పులు, షూ విడవని అధికారులు
- గద్దెల ప్రాంగణంలో తిరిగిన వైనం
తాడ్వాయి, ఫిబ్రవరి 28 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క అధికారులతో కలిసి తల్లుల సన్నిధితో పాటు నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, కలెక్టర్, ఎస్పీ పాదరక్షలను విడిచి భక్తిభావంతో పర్యటించగా ఇతర శాఖల అధికారులు చెప్పులు, షూ విడవకుండా గద్దెల పరిసరాలను కలియతిరిగారు. చెప్పులు, షూ వేసుకొని తల్లుల సన్నిధికి వచ్చిన వారిపై చర్యలు తీసుకొని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
విరిగి పడిన శిలల ప్రాంతాల పరిశీలన
మేడారంలో నూతనంగా నిర్మించిన రాతి కట్టడాలు విరిగిపోయిన విషయం తెలిసిందే. శనివారం మేడారం పర్యటనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి అనసూయ సమ్మక్క గద్దె ప్రాంతంలో విరిగి పడిన శిలలు, కడీల ప్రదేశాన్ని పరిశీలించారు. మేడారం మహా జాతరకు కోట్లాది రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం నాణ్యతగా పనులు చేపట్టకపోవడంతో ‘తిరుగు వారానికే విరిగిపోతున్న శిలలు’ అనే శిర్షీకను ఫిబ్రవరి 4న ‘నమస్తేతెలంగాణ’లో వార్త ప్రచురితమైంది. జాతర సమయంలో భక్తులు కొబ్బరి, బెల్లం విసిరివేయడంతో పాటు భక్తుల తాకిడికి వెదురు బొంగు రాతి కట్టడాలతో పా టు మరికొన్ని రాతి కట్టడాలు విరిగిపోయాయి. మంత్రులు పరిశీలించి రాతి కట్టడాల స్థానంలో నూతన శిలలను ఏర్పాటు, దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

