నిబంధనలకు అనుగుణంగానే బదిలీలు
నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ జైళ్లశాఖలో బదిలీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ‘ఖైదీలు 14.. అధికారులు 53’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. బదిలీలు, పోస్టింగులు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్‌తో కూడిన సీనియర్ జైళ్ల అధికారుల కమిటీ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- వరంగల్ సిబ్బందిని ఇతర యూనిట్లకు వాడుతున్నం
- ‘నమస్తే’ కథనానికి స్పందించిన జైళ్లశాఖ
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ జైళ్లశాఖలో బదిలీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ‘ఖైదీలు 14.. అధికారులు 53’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. బదిలీలు, పోస్టింగులు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్‌తో కూడిన సీనియర్ జైళ్ల అధికారుల కమిటీ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం ఉద్యోగుల జాబితాను రాష్ట్రంలోని అన్ని జైళ్లకు పరిశీలన కోసం, అభ్యంతరాలు స్వీకరించేందుకు పంపిస్తామని వివరించారు. అర్హుల జాబితాను జీవో ప్రకారం ఈ నెల 7న ప్రచురించినట్లు చెప్పారు.
ఇందుకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలులో 65 ఖాళీలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. వరంగల్ సిబ్బంది జైలు సంబంధిత కార్యకలాపాలతో పాటు నా లుగు పెట్రోల్ రిటైల్ అవుట్లెట్లు, పామ్ ఆయిల్ నర్సరీ, గొర్రెల పెంపకం యూని ట్లు, ఫినాయిల్ తయారీ యూనిట్, ఇత ర జైలు ఉత్పత్తి, పునరావాస యూనిట్ల నిర్వహణను కూ డా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ సి బ్బందిలో కొంతమందిని ప్రతివారం రొ టేషన్ పద్ధతిలో అదనపు విధుల కోసం సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్‌కు కూడా పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది అదనంగా ఉన్నారనేది అవాస్తవమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

