ప్రజావాణికి 2,715 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 2,715 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధిక శాతం టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు, పెన్షన్లు , డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 2,715 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధిక శాతం టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు, పెన్షన్లు , డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఇతర సమస్యల పరిషారం కోసం కూడా దరఖాస్తులు చేసుకొన్నారని పేర్కొన్నారు.
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
ఖైరతాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రంలో వెంటనే స్పౌజ్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ స్పౌజ్ ఫోరం అధ్యక్షుడు వివేక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. రెండేండ్ల నుంచి ఉపాధ్యాయులైన దంపతులు వేర్వేరు జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని వివేక్ తెలిపారు.
గత ప్రభు త్వ హయాంలో జారీ చేసిన జీవో 1,655 ప్రకారం ఉపాధ్యాయులైన దంపతులను ఒకే జిల్లాకు బదిలీ చేయాల్సి వున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి మానవీయ కో ణంలో స్పౌజ్ బదిలీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం కోఆర్డినేటర్లతోపాటు 1,300 మంది ఉపాధ్యాయ దంపతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

