హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రజాభవన్‌లో మంగళవారం ప్రజావాణికి 1,906 వినతి పత్రాలు వచ్చాయని అధికారవర్గాలు తెలిపాయి. వినతులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో అధిక సంఖ్యలో వినతులు వస్తున్నట్టు చెప్పాయి.
ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒకరి సమస్యను తెలుసుకుని, వారి అర్జీలను తీసుకొని, నంబర్ కేటాయిస్తూ సెల్‌కు మెస్సేజ్ పంపుతున్నట్టు వెల్లడించాయి.