హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని తెలిపారు.
ఈ నెల 23 నుంచి 26 వరకు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా నమోదయ్యాయి.