INDW vs PAKW | చరణి, ప్రతీకా స్పిన్ మాయాజాలం.. 55 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్..!
INDW vs PAKW : మహిళల ఆసియా కప్‌లో భారత స్పిన్నర్లు ధాటికి పాకిస్థాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. శ్రీ చరణి(3-7), ప్రేమా రావత్(3-9)లు తమ మాయాజాలంతో పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించారు.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్‌లో హ్యాట్రిక్‌పై కన్నేసిన భారత జట్టుకు పాకిస్థాన్ పోటీ ఇవ్వలేకపోయింది. దుబాయ్‌లో భారత స్పిన్నర్లు ధాటికి పాక్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. శ్రీ చరణి(3-7), ప్రేమా రావత్(3-9)లు తమ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించారు. వీరిద్దరి విజృంభణతో టాపార్డర్, మిడిలార్డర్ ప్లేయర్లు ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా 55 పరుగులకే దాయాది జట్టు ఆలౌటైంది.
టీమిండియా చేతిలో ప్రతిసారి కంగుతినే చిరకాల ప్రత్యర్థి కనీసం మోస్తరు లక్ష్యాన్నైనా నిర్దేశిస్తుందనుకుంటే.. మరీ ఘోరంగా చతికిపలడింది. శ్రీ చరణి(3-7), ప్రేమా రావత్(3-9)లు పోటీపడి వికెట్లు తీయడంతో ఏకంగా నలుగురు డకౌటయ్యారు. పేకమేడను తలపించిన పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షవాయ్ జుల్ఫికర్ 14 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
Innings Break!
An outstanding bowling performance from #TeamIndia! 🙌 🙌
3️⃣ wickets each for Sree Charani & Prema Rawat
2️⃣ wickets for Deepti Sharma
1️⃣ wicket for Shafali VermaStay tuned for India’s chase! ⌛️
Scorecard ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/e27WuNsSL0
— BCCI Women (@BCCIWomen) September 5, 2026
షఫాలీ మొదలెట్టగా..
అనిశ్చితికి కేరాఫ్ అయిన పాకిస్థాన్ ఆసియా కప్‌లో టీమిండియా స్పిన్నర్లకు తలొగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్‌కు షఫాలీ షాకిచ్చింది. ఓపెనర్ మునీబా అలీ(13)ని బౌల్డ్ చేసి తను బ్రేకివ్వగా.. అక్కడి నుంచి చరణి, రావత్ చుట్టేశారు. మరో ఓపెనర్ జుల్ఫీకర్(14)ను చరణి ఎల్బీగా వెనక్కి పంపింది. వీరిద్దరూ స్పిన్ మ్యాజిక్ చూపించగా పాక్ బ్యాటర్ల తడబాటు మొదలైంది.
#TeamIndia spinners on a roll with the ball 🥳
Shafali Verma 🤝 Sree Charani 🤝 Prema Rawat 🤝 Deepti Sharma
Updates ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/veFeRXIs6V
— BCCI Women (@BCCIWomen) September 5, 2026
నలుగురు డకౌటవ్వగా మునీబ చేసిన 13 రన్స్ మినహా ఎవరూ రెండంకెల స్కోర్ దాటలేదు. దాంతో.. 18.1 ఓవర్లో 55 పరుగులకే దాయాది జట్టు ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌తో చెత్త రికార్డు మూటగట్టుకుంది ఫాతిమా సనా బృందం. ఇదివరకూ 2024లో న్యూజిలాండ్‌పై 56 రన్స్‌కే పాక్ పది వికెట్లు కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

