Miss World 2026 : భారత్‌కు ఏడో మిస్ వరల్డ్ కిరీటం అందించాలనుకున్న నిఖితా పొర్వాల్ (Nikhita Porwa) కల చెదిరింది. 73వ ‘మిస్ వరల్డ్’ పోటీల నుంచి నిఖితా నిష్క్రమించింది. వియత్నాంలో జరుగుతున్న ఈ అందాల వేడుకలో టాప్- 40లో నిలిచిన ఈ బ్యూటీకి టాప్-20లో మాత్రం చోటు దక్కలేదు. దాంతో.. నిరాశగా వెనుదిరిగిందీ ఉజ్జయిని ముద్దుగుమ్మ. ప్రపంచ సుందరి ఫైనల్లో నిఖిత ముందంజ వేయలేపోయిందని మిస్ ఇండియా సంస్థ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది.
వియత్నాం వేదికగా జరుగుతున్న 73వ మిస్ వరల్డ్ ఫైనల్లో సత్తా చాటాలనుకున్న భారత సుందరి నిఖితా పొర్వాల్ ఇంటిదారి పట్టింది. శనివారం వియత్నాం సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్న నిఖిత.. టాప్-40లో నిలిచింది. కానీ, టాప్-20లో మాత్రం ఆమెకు స్థానం దక్కలేదు. దాంతో.. నిరాశగా ఈ పోటీల నుంచి వైదొలిగింది నిఖిత.
India’s Nikita Porwal bows out of 73rd Miss World 2026 after a Top 40 finish#India #NikitaPorwal #73rdMissWorld2026
Read @ANI Story|https://t.co/jx7Lv2pA6c pic.twitter.com/pbCwYoyNUh
— ANI Digital (@ani_digital) September 5, 2026
’73వ మిస్ వరల్డ్ పోటీలను టాప్-40తో నిఖిత ముగించింది. విశ్వ వేదికపై నువ్వు.. భారతీయుల సౌందర్యాన్ని, హృదయాన్ని ప్రదర్శించావు. ఈ పోటీల్లో నువ్వు మాకు అందించిన ప్రతి క్షణం నుంచి విసిరిన ప్రతి నవ్వు దేశానికి చెందుతుంది. మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు ధన్యవాదాలు. నిన్ను చూసి ఎల్లప్పడూ భారత్ గర్విస్తోంది’ అని మిస్ ఇండియా సంస్థ పోస్ట్ పెట్టింది. ఉజ్జయినికి చెందిన నిఖిత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 విజేత.
The moment we were waiting for, and what a feeling it was to hear India called on the Miss World stage!
Femina Miss India World @nikitaporwal_ advances to the Top 40 at the 73rd Miss World Finals, carrying the hopes, love and pride of an entire nation with her.
One step closer.… pic.twitter.com/r5LA6wwjTN
— @zoomtv (@ZoomTV) September 5, 2026
ఇప్పటివరకూ ఆరుసార్లు భారత మహిళలు మిస్ వరల్డ్ కిరీటం గెలుపొందారు. రీటా ఫారియా 1966లో విజేతగా నిలవగా.. ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ టైటిల్‌ను అందుకుంది. హైదరాబాదీ అయిన డయానా హెడేన్ 1997లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుది. ఆపై యుక్తా మొఖే 1999లో మిస్ వరల్డ్ టైటిల్‌తో భారతీయులను సంబురాల్లో ముంచెత్తింది. ప్రియాంకా చోప్రా 18 ఏళ్లకే మిస్ వరల్డ్ అయింది. 2000 సంవత్సరంలో లండన్‌లోని మిలీనియం డోమ్‌లో జరిగిన ఫైనల్లో ప్రియాంకను ఈ కిరీటం వరించింది. అనంతరం 17 ఏళ్లకు మానుషి చిల్లర్ మనదేశానికి మిస్ వరల్డ్ కిరీటాన్ని తీసుకొచ్చింది.
