INDW vs PAKW | భారత స్పిన్‌కు పాకిస్థాన్ విలవిల.. 8.4 ఓవర్లోనే హర్మన్‌ప్రీత్ సేన జయభేరి..!
INDW vs PAKW : మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. శ్రీ చరణి(3-7), ప్రేమా రావత్(3-9)ల విజృంభణతో 55కే పాక్ కుప్పకూలగా.. ఉమెన్ ఇన్ బ్లూ స్వల్ప లక్ష్యాన్ని 8.4 ఓవర్లలోనే ఛేదించింది. టాపార్డర్‌ను ఫాతిమా సనా(3-17) త్వరగా వెనక్కి పంపినా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(18 నాటౌట్), దీప్తి శర్మ(12 నాటౌట్)లు ఒత్తిడికి లోనవ్వకుండా ఆడారు. దాంతో.. ఈ మెగా టోర్నీలో దాయాదిపై ఏడో విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లింది భారత్.
ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఎప్పటిలానే పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఏకపక్ష పోరులో పాక్‌ను వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత స్పిన్నర్లు పంజా విసరడంతో దాయాదిని 55కే కట్టడి చేసిన భారత్ చిన్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అయితే.. టీమిండియా స్పిన్నర్లు చెలరేగిన చోట పేసర్ ఫాతిమా సనా(3-17) చకచకా మూడు వికెట్లు తీసింది.
Harmanpreet Kaur’s landmark game 🫡
No other man or woman has led in as many T20Is pic.twitter.com/d4ZL2fplc3
— Cricinfo (@cricinfo) September 5, 2026
తన మొదటి ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ షఫాలీ వర్మ(12)ను.. ప్రతీకా రావల్(4)ను ఔట్ చేసింది. ఆ తర్వాతి బౌండరీతో ఆత్మవిశ్వాసంగా కనిపించిన స్మృతి మంధాన(9)ను సైతం ఎల్బీగా వెనక్కి పంపింది పాక్ కెప్టెన్. దాంతో.. 29 పరుగులకే మూడు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(18 నాటౌట్), దీప్తి శర్మ(12 నాటౌట్) నింపాదిగా ఆడి పవర్ ప్లేలో వికెట్ ఇవ్వలేదు. నష్ర వేసిన 9వ ఓవర్లో వరసగా 4, 6 బాదిన కౌర్ జట్టుకు 7 వికెట్ల విజయాన్ని అందించింది.
Another mismatch
India win their fifth consecutive women’s T20I against Pakistan 💪 pic.twitter.com/vVVOxnjn7Y
— Cricinfo (@cricinfo) September 5, 2026
షఫాలీకి తొలి వికెట్
అనిశ్చితికి కేరాఫ్ అయిన పాకిస్థాన్ ఆసియా కప్‌లో టీమిండియా స్పిన్నర్లకు తలొగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్‌కు షఫాలీ షాకిచ్చింది. ఓపెనర్ మునీబా అలీ(13)ని బౌల్డ్ చేసి తను బ్రేకివ్వగా.. అక్కడి నుంచి చరణి, రావత్ చుట్టేశారు. మరో ఓపెనర్ జుల్ఫీకర్(14)ను చరణి ఎల్బీగా వెనక్కి పంపింది. వీరిద్దరూ స్పిన్ మ్యాజిక్ చూపించగా పాక్ బ్యాటర్ల తడబాటు మొదలైంది.
From 27-1 to 55 all out 😮 pic.twitter.com/j1fo8GVOY1
— Cricinfo (@cricinfo) September 5, 2026
భారత బౌలర్ల ధాటికి నలుగురు డకౌటవ్వగా మునీబ చేసిన 13 రన్స్ మినహా ఎవరూ రెండంకెల స్కోర్ దాటలేదు. దాంతో.. 18.1 ఓవర్లో 55 పరుగులకే దాయాది జట్టు ఆలౌటైంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌తో చెత్త రికార్డు మూటగట్టుకుంది ఫాతిమా సనా బృందం. ఇదివరకూ 2024లో న్యూజిలాండ్‌పై 56 రన్స్‌కే పాక్ పది వికెట్లు కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

