హైదరాబాద్, జనవరి 23 (నమస్తేతెలంగాణ): స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ ఆఫీసులో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలంగాణ సర్పంచుల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్‌లోని ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేశారు.
తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని తెలిపారు. ఆయన వెంట జేఏసీ ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, నాయకులు శంకర్ ఉన్నారు.