హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పంచాయతీ తుది విడత పోలింగ్ బుధవారం ఉద యం 7 నుంచి ఒంటిగంట వరకు జరుగనున్నది. పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసులు బం దోబస్తు ఏర్పాటు చేశారు. తుది విడత పోరులో 3,752 సర్పంచ్ స్థానాలకుగాను 12,652 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 28,410 వార్డులకుగాను 75,725 మంది పోటీలో ఉన్నారు. 3,547 పోలింగ్స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎస్ఈసీ ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్, కార్యదర్శి, జిల్లా కేంద్రాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ సరళిని పరిశీలిస్తారు. 4,502 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 77,618 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల అధికారులు నియమించారు. 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.
53,06,401మంది ఓటర్లు
తుది విడతలో మొత్తం 4,159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో వివిధ కారణాలతో 11 జీపీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. హైకోర్టు ఆదేశం మేరకు 2 గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేశారు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 గ్రామాల్లో బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. ఈ జీపీల్లో సర్పంచ్ బరిలో 12,652 మంది ఉన్నారు. అంటే ఒక్కో సర్పంచ్ సీటుకు(3.88 శాతం) ముగ్గురికిపైగా పోటీ పడుతున్నారు. మొత్తం 53,06,401 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 26,01,861మంది, మహిళలు 27,04,394 మంది, 140 మంది ఇతరులు ఉ న్నారు. తుది విడత మొత్తం 36,452 వార్డుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 116 వా ర్డులకు నామినేషన్లు పడలేదు. మరో 7,908 వా ర్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డు ల్లో ఎన్నికల్లో నిలిచాయి. మిగిలిన 28,410 వార్డులకుగాను 75,725 మంది పోటీలో ఉన్నా రు. 36,483 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు.
రూ.9.11 కోట్ల సొత్తు సీజ్
కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి మంగళవారం వరకు రూ.9.11 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. బీఎన్ఎస్ సెక్షన్ల కింద 36,165 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు. 912 లైసెన్స్డ్ ఆయుధాలు, రూ.2,09,84,530 నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. రూ.3.81 కోట్ల విలువైన మద్యం, రూ.2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ 9240021456 ఏర్పాటు చేశారు.
కారు జోరు.. కాంగ్రెస్ బేజారు
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు పెద్దసంఖ్యలో గెలుస్తున్నారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థు లు 50 శాతం విజయాలు దాటేందుకు ఆపసోపాలు పడుతున్నారు. సాధారణం గా అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు 80-90 శాతం సీట్లు సాధిస్తుంటారు. కానీ, తొలి, మలి దశ పోలింగ్‌లోనూ 30-40 శాతం సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మంత్రులు పొంగులేటి, దామోదర, ఎమ్మెల్యే కడియం స్వగ్రామా ల్లో వారి అభ్యర్థులు ఓటమి చవిచూశా రు. దాదాపు సగం జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. తుది పోరులో అధికార నేతల అండతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు మంగళవారం రాత్రి భారీగా డబ్బులు పంపిణీ చేసినట్టు సమాచారం.
తుది విడత ఎన్నికల వివరాలు