నిజాంపేట, జూన్ 21: రైతుభరోసాకు అధికారులు కొర్రీలు పెడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలోని సెంట్రల్ బ్యాంక్ నుంచి వ్యవసాయం, వివిధ అవసరాల నిమిత్తం నార్లపూర్, వెంకటాపూర్(కె), తిప్పనగుల్ల, రజాక్‌పల్లి, కల్వకుంట గ్రామాలకు చెందిన రైతులు రుణాలు తీసుకున్నారు.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం జమచేస్తుండగా పైసల కోసం బ్యాంక్‌కు వెళ్తున్న రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. క్రాప్లోన్తోపాటు వడ్డీ చెల్లించాలని లేకుంటే రైతుభరోసా పైసలు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.