ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేశారు. మొత్తం 9 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్లో కూడా కుండపోత వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే అధికారులు ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడం జరిగింది.