రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. జల మండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కొదరు కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేసినా కూడా పట్టించుకోకపోవడంతో వీటిని అధికారులు తొలగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీబీలతో ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.
ఈ ప్రాంతంలో అక్రమంగా వేసిన 62 షెడ్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. అర్ధరాత్రి నుంచి ఈ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. ఈ చర్యలను రాజేంద్రనగర్ ఆర్డీవో, శంషాబాద్ డీసీపీ పర్యవేక్షిస్తున్నారు. కబ్జా దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.