RBI | కీలక వడ్డీరేట్లు యథాతథం.. 5.25 శాతం వద్దే రెపో రేటు
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మునుపటి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఇవాళ్టి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు.
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మునుపటి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఇవాళ్టి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటు (Repo Rate) లో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇది. గత ఏడాది ఈ వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోతపెట్టింది. ఆ తర్వాత డిసెంబర్లో మరో పావు శాతం తగ్గించింది. దాంతో గత ఏడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంలో 6.9 శాతం, రెండో త్రైమాసికంలో 7 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉండొచ్చని తెలిపింది. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4 శాతం, రెండో త్రైమాసికంలో 4.2 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావచ్చని అర్బీఐ అంచనా వేసింది.
కాగా జనవరి చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు 723.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వ్యవస్థలో ద్రవ్య లభ్యత రోజువారీ సగటున రూ.75 వేల కోట్లుగా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

