అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల ఘటన ( Gunfire ) కలకలం రేపింది. పోలీసులపై దాడి చేసిన నిందితుడిపై జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిద్యం వహిస్తున్న హిందూపురం ( Hindu Puram ) నియోజకవర్గం చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద కాల్పులు జరిగాయి.
గతంలో అత్త, కోడలిపై అత్యాచారం చేసి పరారీలో నిందితుడు నాగేంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ ఆంజనేయుడు, కానిస్టేబుల్ రవి నిందితుడిని పట్టుకునే క్రమంలో నిందితుడు ఇద్దరిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో పోలీసులు నిందితుడు మోకాలిపై తుపాకితో కాల్చడంతో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ముగ్గురిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు.