Peddapalli | పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఓదెల జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను గంట రాములు ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ గార్డెన్లో గంట రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయం, ఆత్మగౌరవం లేని చోట ఉండేది లేదన్నారు. పార్టీ టికెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి రూ. 50,000లు తీసుకున్నారని ఆరోపించారు. తమకు 80 మందికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. మాతో మాట్లాడలేదు. తెలంగాణ బీసీలకు కనీసం గౌరవం లేదని మండిపడ్డారు.
తుమ్మల నాగేశ్వర్ రావు రెండుసార్లు ఓడితే గొప్పనాయకుడు ఎలా అయ్యారు..? రెండుసార్లు ఓడిన పొన్నాల సిగ్గులేదనే మాటలు పడాలా..? అని గంట రాములు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు.. రాబోయే రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటిస్తాం. అన్యాయం జరిగిన చోట ఆత్మగౌరవం లేని చోట ఉండేది లేదు. రేపు మరింత ముఖ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని గంట రాములు ప్రకటించారు.