నాగర్కర్నూల్, నవంబర్ 3 : నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలోని పంట పొలాల్లో క్షుద్రపూజల ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం పూజలు చేసినట్టు తెలుస్తున్నా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
గమనించిన సదరు పొలం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల కథనం మేరకు.. తాళ్లపల్లికి చెందిన పెద్ద చిలికేశ్వరం తిరుపతయ్య పత్తి పంట సాగు చేశాడు. భారీ వర్షాలతో చాలా మంది రైతుల పత్తి పంట నీటిపాలైంది. కానీ, తిరుపతయ్య పత్తిపంట ఏపుగా పెరిగింది. ఇది చూసి ఓర్వలేని కొందరు క్షుద్రపూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.