హైదరాబాద్, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ) : హైకోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించిన భవనంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (న్యాయసేవా సదన్) కార్యాలయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే గురువారం ప్రారంభించారు.
కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పీ శ్యాంకోశీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ పీ వినోద్ కుమార్, ఇతర న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎస్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.