హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : వైద్య సేవల్లో నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకమని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కోఠి హెల్త్ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నూతనంగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్ర స్థాయి తొలి ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పేషెంట్ దవాఖానలో చేరిన నాటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడేది నర్సింగ్ ఆఫీసర్లే అని తెలిపారు.